subham
-
శుభం సినిమా ట్రైలర్ రిలీజ్.. అతిథి పాత్రలో సమంత
-
ట్రైలర్: సీరియల్స్ చూస్తున్నంతసేపు దెయ్యంగా.. కాపాడనున్న సమంత!
హీరోహీరోయిన్లు ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్ చూస్తున్నారు. నాని ఇటీవలే నిర్మాతగా కోర్టు మూవీతో విజయం అందుకున్నాడు. తాజాగా హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) కూడా ప్రొడ్యూసర్‌గా సత్తా చూపించేందుకు సిద్ధమైంది. ఆమె కొత్తగా ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్‌ను స్థాపించింది. ఈ బ్యానర్లో శుభం అనే సినిమా తెరకెక్కింది. కొత్తవారితో కలిసి చేసిన ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రెగుల దర్శకత్వం వహించాడు.సీరియల్స్ చూస్తున్నంతసేపు ఒంట్లో దెయ్యంఆదివారం (ఏప్రిల్ 27) నాడు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆడవాళ్లు సీరియల్స్‌కు బానిసైపోతారు. ఏం చేస్తున్నా సరే సీరియల్ టైం అవగానే టీవీ ముందు కూర్చుంటారు. వాళ్లను డిస్టర్బ్ చేశారంటే వాళ్ల పని అధోగతే! సీరియల్స్ చూస్తున్నప్పుడు వారి శరీరంలోకి ఓ దెయ్యం వచ్చినట్లే ప్రవర్తిస్తున్నారు. దీంతో మగవాళ్లు చివర్లో ఓ మాతను కలుస్తారు. ఇక్కడ మాత స్థానంలో ఉన్నది మరెవరో కాదు సమంత. ఊర్లో ఉన్న మగవాళ్లందరినీ కాపాడమని వాళ్లు ఆమె శరణు కోరతారు.మే 9న రిలీజ్మరి సమంత ఏం చేసింది? వాళ్లను కాపాడిందా? లేదా? అన్నది తెలియాలంటే మే 9న ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే! ఈ విచిత్రమైన కథను చచ్చినట్లు చూడాల్సిందే అని ట్రైలర్లోనే నొక్కి చెప్పారు. ఏదేమైనా ఈ మూవీలో సమంతను చూసి అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్న సామ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చదవండి: పిలిస్తే రానన్నానా? అంతేలే.. హర్టయిన రామజోగయ్య శాస్త్రి -
సమంత నిర్మాతగా తొలి మూవీ.. టీజర్ రిలీజ్
స్టార్ హీరోయిన్ సమంత.. సినిమాల్లో నటించి చాలా రోజులైపోయింది. చివరగా 'ఖుషి'లో కనిపించింది. తర్వాత ఒకటి రెండు వెబ్ సిరీసులు చేసిందంతే. మరోవైపు నిర్మాణ సంస్థ స్థాపించింది. ఇప్పుడు అందులో నిర్మించిన సినిమాని ఇప్పుడు విడుదలకు సిద్ధం చేసేసింది కూడా.(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్)పలువురు చిన్న నటీనటులతో తీసిన ఈ సినిమాకు శుభం టైటిల్ ఫిక్స్ చేశారు. కొన్నిరోజుల క్రితం దీని గురించి బయటపెట్టగా.. ఇప్పుడు ఉగాది సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే ఇది ఫన్నీగా ఉంది. హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయనిపిస్తోంది. మీరు కూడా టీజర్ పై ఓ లుక్కేయండి. (ఇదీ చదవండి: పూరీ-సేతుపతి అఫీషియల్.. రెండు విషయాల్లో క్లారిటీ) -
సమంత కొత్త జర్నీ.. 'బంగారం' కంటే 'శుభం' ముందు
చాన్నాళ్ల నుంచి సమంత తెలుగు సినిమాలు చేయట్లేదు. చివరగా విజయ్ దేవరకొండ 'ఖుషి'లో నటించిన సామ్.. ఆ తర్వాత 'సిటాడెల్' వెబ్ సిరీస్ చేసింది. అది తప్పితే కొత్త ప్రాజెక్టులేం చేయలేదు. దీంతో సమంత ఇక కొత్త చిత్రాలకు స్వస్తి చెప్పేసిందనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు 'శుభం'తో కొత్త ప్రయాణం ప్రారంభించింది. ఈ మేరకు కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: కుడుంబస్థాన్ సినిమా రివ్యూ (ఓటీటీ))ఇప్పటివరకు సమంత అంటే మనకు తెలిసింది హీరోయిన్ మాత్రమే. కానీ ఇకపై నిర్మాతగానూ వరస సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఉంది. ఈ క్రమంలోనే తొలి ప్రాజెక్టుగా 'శుభం' ప్రకటించింది. పలువురు యువ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. కామెడీ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.సమంత.. త్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో గతంలోనే 'నా ఇంటి బంగారం' అని ఓ మూవీ ప్రకటించింది. కానీ అది ఇప్పుడు ఏ దశలో ఉందో.. అసలు ఉందో లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికే 'శుభం' షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సన్గ్రేస్ను గెలిపించిన శుభ్, అస్లామ్
సాక్షి, హైదరాబాద్: బౌలింగ్‌లో శుభ్ అగర్వాల్ (4/8), మొహమ్మద్ అస్లామ్ (4/8) చెలరేగడంతో ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో సన్‌గ్రేస్ జట్టు విజయం సాధించింది. శనివారం సెయింట్ సాయి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌గ్రేస్ జట్టు 21.5 ఓవర్లలో 51 పరుగుల అల్ప స్కోరుకే ఆలౌటైంది. విక్రాంత్ చౌదరీ (19) టాప్ స్కోరర్. సెయింట్ సాయి బౌలర్లలో నిఖిల్ 3 వికెట్లు పడగొట్టగా... లలిత్, తేజ, సన్నీ తలా రెండు వికెట్లతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ సాయి జట్టు శుభ్ అగర్వాల్, అస్లామ్ ధాటికి 26.2 ఓవర్లలో 46 పరుగులకే కుప్పకూలింది. రిలయన్స, యూనివర్సల్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో రిలయన్స జట్టు ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూనివర్సల్ జట్టు 22.4 ఓవర్లలో 67 పరుగులకు ఆలౌటైంది. హర్ష (23) రాణించాడు. రిలయన్స బౌలర్లలో కౌస్తుబ్ 5 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం రిలయన్స జట్టు 7.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసి గెలిచింది. అఖిల్ (51) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.