శుభవార్త చెప్పిన 'వరుణ్ తేజ్, లావణ్య'.. కంగ్రాట్స్‌ అంటూ అల్లు స్నేహ | Varun Tej And Lavanya Tripathi Expecting Their First Child, News Announced | Sakshi
Sakshi News home page

ఫోటోతో శుభవార్త చెప్పిన 'వరుణ్ తేజ్, లావణ్య'

May 6 2025 12:12 PM | Updated on May 6 2025 12:37 PM

Varun Tej And Lavanya Tripathi Expecting Their First Child, News Announced

మెగా కుటుంబం నుంచి శుభవార్త వచ్చేసింది.  వరుణ్ తేజ్(Varun Tej)-లావణ్య త్రిపాఠి దంపతులు తమ అభిమానుల కోసం సోషల్‌మీడియాలో ఈ వార్తను ప్రకటించారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జీవితంలో అత్యంత సంతోషకరమైన బాధ్యతను తీసుకోబోతున్నామని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లతో పాటు మెగా అభిమానులు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.  మెగా ఇంటికి వారసుడు రాబోతున్నాడు అంటూ అభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారు. 

2023లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మొదటి బిడ్డను ఆహ్వానించనున్నారు. శుభవార్త చెప్పిన వరుణ్‌ దంపతులకు అల్లు అర్జున్‌ సతీమణి స్నేహ శుభాకాంక్షలు చెప్పారు. ఆపై సమంత, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, రీతూ వర్మ, డింపుల్ హయాతి, సుశాంత్‌ వంటి సినీ స్టార్స్‌ కంగ్రాట్స్‌ అంటూ కామెంట్‌ బాక్స్‌లో మెసేజ్‌లు చేశారు. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi) మళ్లీ షూటింగ్స్‌లలో పాల్గొంటూ వచ్చారు.  ఈ క్రమంలోనే ఒక వెబ్‌ సిరీస్‌ను ఆమె విడుదల చేశారు. ఆపై సతీ లీలావతితో పాటు కోలీవుడ్‌ మూవీ థనల్‌ను ఆమె పూర్తి చేశారు. అయితే, ఈ రెండు ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత ఆమె మళ్లీ కాస్త బ్రేక్‌ ఇచ్చారు. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్‌ కావడంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు.  

2017లో వరుణ్‌, లావణ్యల మధ్య ఏర్పడిన స్నేహం ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరు కలిసి  ‘మిస్టర్‌’ అనే సినిమాలో తొలిసారి నటించారు. ఆ సమయంలోనే వరుణ్‌, లావణ్య త్రిపాఠి క్లోజ్‌ అయ్యారు. మొదట్లో స్నేహం.. ఆ తర్వాత అది ప్రేమగా మార్చుకొని డేటింగ్‌ వరకు వెళ్లారు. కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేశారు. సరిగ్గా పెళ్లికి కొద్దిరోజులు ముందు వారి ప్రేమ విషయాన్ని అందరికీ తెలిపారు. అలా వరుణ్‌, లావణ్యల పెళ్లి ఇట‌లీలో జరగగా.. హైదరాబాద్‌లో రిసెప్ష‌న్  ఘనంగా జరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement