Sargunam
-
పాసవ్వాలా... ఫెయిలవ్వాలా... అంతా పైసల పైనే
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ఎగ్జామ్ సిరీస్ ఒకటి. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.ఓ కుటుంబం బావుండాలన్నా, ఓ ఊరు బావుండాలన్నా లేదా దేశం బావుండాలన్నా చదువుకుని ఉండాలి. నేటి సమాజంలో మనం సజావుగా బతకాలి అంటే భాష ఏ విధంగా అవసరమో అదే విధంగా చదువు కూడా అంతే అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. కానీ ఇప్పటి పరిస్థితులలో చదువుకునేవారు తక్కువయ్యారు... చదువు కొనేవారు ఎక్కువయ్యారు. రాత్రింబవళ్ళూ కష్టపడి చదివి పరీక్ష రాస్తే, కష్టపడని కొందరు దొడ్డిదారిన అసలైన వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో అల్లుకున్న కథతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన సిరీస్ ‘ఎగ్జామ్’. ప్రైమ్ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ 7 భాగాలతో లభ్యమవుతోంది. దాదాపుగా వాస్తవిక ఘటనలతో, చిన్నపాటి సినిమాటిక్ లిబర్టీతో ఓ నిజమైన సమస్యను మన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు సర్గుణమ్. ఈ సిరీస్ మొత్తం గ్రిప్పింగ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. కథాంశానికి వస్తే... తమిళనాడు లోని తైకారా ప్రాంతానికి కొత్తగా ఎంపికైన డీఎస్పీ మారుమల్లి ఛార్జి తీసుకోవడానికి తన కారులో బయలుదేరుతుంది. దారిలో మారుమల్లిని ఝాన్సీ కిడ్నాప్ చేసి తైకారాకు తాను డీఎస్పీగా వెళుతుంది. ఓ డీఎస్పీ స్థాయి వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ తన స్థానంలో వెళ్ళడమనేది సినిమాటిక్ లిబర్టీ అనుకున్నా కాస్త ఎక్కువైందని చెప్పవచ్చు. కాకపోతే ఇక అక్కడి నుండి మెల్ల మెల్లగా కథలోకి తీసుకువెళతారు దర్శకుడు. అసలు మారుమిల్లిని ఝాన్సీ ఎందుకు కిడ్నాప్ చేసింది? స్టేషన్‌కి చేరుకున్న ఝాన్సీని ఎవరైనా గుర్తుపట్టారా? లేదా అన్న అంశాలను మాత్రం సిరీస్‌లోనే చూడాలి. ఈ సిరీస్ మొత్తం అయిపోయాక మన విద్యా వ్యవస్థలో ఉన్న చీకటి కోణాలు స్పష్టంగా అర్థం అవుతాయి. ఒక దశలో ఏ ఎగ్జామ్ అయినా పాసవ్వాలా... ఫెయిలవ్వాలా అన్నది తామిచ్చే పైసల మీదే ఆధారపడుతుందన్న విషయం తెలుస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరూ చూసి తెలుసుకోవాల్సిన సిరీస్ ఇది. – హరికృష్ణ ఇంటూరు -
ఓవియ తొలి చిత్రానికి సీక్వెల్
తమిళసినిమా: నటి ఓవియను తమిళ ప్రేక్షకులకు దగ్గర చేసిన చిత్రం కలవాణి. విమల్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని సర్గుణం తెరకెక్కించారు. ఆయనకి దర్శకుడిగా ఇది మొదటి చిత్రమే. 2010లో విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని అందుకుంది. ముఖ్యం గా నటి ఓవియకు మరిన్ని అవకాశాలను తెచ్చి పెట్టిన చిత్రం కలవాణి. కాగా ఆ తరువాత ఓవియకు సరైన సక్సెస్‌లు పడలేదనే చెప్పా లి. అంతే కాదు అవకాశాలు రాలేదు. అయితే బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్న ఓవియను ఆ గేమ్ షో మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. నటిగా అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ, కథా నాయకుడిగా నటిస్తున్న కాంచన–3 చిత్రంలో ఓవియ కథా నాయకిగా నటిస్తోంది. ఇకపోతే సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో కలవాణి చిత్రానికి సీక్వెల్ తయారు అవుతోం ది. ఎనిమిదేళ్ల తరువాత కలవాణి–2 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అదే విమల్, ఓవియల జంట కలిసి నటిస్తున్నారు. కలవాణి చిత్ర దర్శకుడు సర్గుణం తన వర్ణన్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల మొదలైంది. ఇందులో నటించే ఇతర నటీనటులు, సంకేతిక వర్గాన్ని త్వరలో వెల్లడించనున్నట్లు దర్శక నిర్మాత సర్గుణం తెలిపారు. ఈ కలవాణి జంట మరోసారి మ్యాజిక్ చేస్తారా? అన్నది చూడాల్సిందే. ఇక ఈ చిత్ర టైటిల్‌ను గురువారం సాయంత్రం నటుడు శివకార్తికేయన్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించడం విశేషం. ఇప్పటికే సర్గుణం మాధవన్ హీరోగా ఒక చిత్రం చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఆయన సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నా రు. ఈ రెండు చిత్రాల షూటింగ్ మార్చిలో జరగనుందట. -
సర్గుణం దర్శకత్వంలో మాధవన్
వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు సర్గుణం, సెలెక్టెడ్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న నటుడు మాధవన్ ఈ కాంబినేషన్ లో ఒక భారీ చిత్రం తెరకెక్కనుంది. ఇరుదు చుట్రు వంటి ఘన విజయం సాధించిన చిత్రం తరువాత ఈ బహుభాషా నటుడు ఏ చిత్రాన్ని అంగీకరించలేదు. ఇందులో ఇంతకు ముందెప్పుడూ నటించనటువంటి వినూత్న కథా పాత్రలో మాధవన్ కనిపించనున్న ఈ చిత్రం జంగిల్ నేపథ్యంలో యాక్షన్, ఎడ్వెంచర్ కథా ఇతివృత్తంగా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇంతకు ముందు విజయ్‌సేతుపతి హీరోగా ఆరెంజ్ మిఠాయ్, రెక్క చిత్రాలను నిర్మించిన కామన్ మ్యాన్ సంస్థ అధినేత గణేశ్, దర్శకుడు సర్గుణంతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సర్గుణం ఇంతకు ముందు నిర్మాతగా మాంజాపై చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం నయనతార నాయకిగా దోర చిత్రాన్ని నిర్మిస్తున్నారన్నది గమనార్హం. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో నటించే కథానాయకి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చిత్ర వర్గాలు వెల్లడించారు. కుటుంబ సమేతంగా ముఖ్యంగా పిల్లల్ని అలరించే విధంగా కథను తయారు చేసుకున్న ఈ చిత్ర షూటింగ్‌ను థాయ్‌లాండ్, మంగోలియా, తజికిస్థాన్ దేశాల్లో నిర్వహించనున్నట్లు దర్శకుడు సర్గుణం తెలిపారు. -
సర్గుణం దర్శకత్వంలో మాధవన్
సర్గుణం దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు నటుడు మాధవన్.ఆయన యూత్‌లో.. అదీ అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడన్న విషయం తెలిసిందే. కొంత గ్యాప్ తరువాత మాధవన్ నటించిన ఇరుదు చుట్రు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా రెండు తమిళ చిత్రాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో ఒకటి సర్గుణం చిత్రం. ఇంతకు ముందు కలవాణి, వాగై చూడవా, నయాండి, సండీవీరన్ చిత్రాలను తెరకెక్కించిన సర్గుణం ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మాధవన్ హీరోగా ఒక చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. చిత్ర షూటింగ్ పూర్తిగా విదేశాల్లో నిర్వహించనున్నారట. ఇరుదు చుట్రు చిత్రం కోసం బరువు పెరిగిన మాధవన్ ఈ చిత్రం కోసం దాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉన్నారట. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఈయన చెన్నైకి తిరిగి రాగానే సర్గుణం చిత్ర షూటింగ్లో పాల్గొననున్నారని సమాచారం. తదుపరి మలయాళ చిత్రం చార్లీ రీమేక్‌లో నటించనున్నారు మాధవన్. చార్లీ మలయాళంలో మంచి విజయాన్ని సాధించిందన్నది గమనార్హం. ఈ రెండు చిత్రాలతో పాటు మరో చిత్రం కూడా మాధవన్ కోసం ఎదురు చూస్తోందని కోలీవుడ్ వర్గాల సమాచారం.


