public sector employees
-
ప్రభుత్వ న్యాయ విభాగాల్లో 30% మహిళా కోటాపై తేల్చండి
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, విభాగాలు, ట్రిబ్యూనళ్లు, రెగ్యులేటరీల వంటి ప్రభుత్వ ప్యానెళ్లలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయ సలహాదారు, గవర్నమెంట్ ప్లీడర్, న్యాయాధికారి వంటి పోస్టుల్లో మహిళా న్యాయవాదులకు 30 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. లాడ్లీ ఫౌండేషన్ ట్రస్ట్ వేసిన ఈ పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంఛోలీల ధర్మాసనం విచారించింది. ఈ విషయంలో మీ స్పందన తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీచేసింది. సుప్రీంకోర్టులోని ప్యానెళ్లు మొదలు స్థానిక న్యాయసహాయక అథారిటీల్లో మహిళా న్యాయవాదులకు తగు ప్రాధాన్యత దక్కేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ విషయమై తాము ఇప్పటికే దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో మహిళా లాయర్ల ప్రాతినిధ్యాన్ని తేల్చేందుకు సర్వే పూర్తిచేశామని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ వికాస్‌సింగ్ తెలిపారు. దీంతో జస్టిస్ సూర్యకాంత్ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఇటీవల తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రతినిధులు నన్ను కలిశారు. అక్కడ మహిళా లాయర్‌ను సెక్రటరీగా నియమించారని తెలిసి ఆశ్చర్యపోయా. అక్కడ మొత్తం 19,000 మంది బార్ సభ్యులున్నారని, వారిలో 8,000 మంది లాయర్లు తరచూ కోర్టులకు హాజరవుతారని తెలిసింది. వారిలో 2,000 మంది మహిళా లాయర్లే. వీరిలో ఒకరికి మాత్రమే సెక్రటరీ పదవి దక్కింది’’ అని సీజేఐ గుర్తుచేశారు. మహిళా లాయర్లు న్యాయవాద వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యలపై విడిగా పిల్ వేస్తామని సింగ్ తెలిపారు. ‘‘ లా కాలేజీల్లో చాలా మంది అమ్మాయిలు చేరి లా పట్టా పుచ్చుకుంటున్నా న్యాయస్థానాల దాకా రావట్లేదు. న్యాయవాద వృత్తిలోకి రాకుండా ఎన్నో ప్రతిబంధకాలు వాళ్లకు అడ్డుగా నిలుస్తున్నాయి. అందుకే 30 శాతం రిజర్వేషన్ ద్వారా మహిళల ప్రాతినిధ్యం ఈ వృత్తిలో పెంచాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్యానెళ్లు, ప్రభుత్వ లా ఆఫీసర్ పదవులు, న్యాయ సహాయకులు, అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో లీగల్ నిపు ణులు,సలహాదారుల పదవుల్లోకి మహి ళా లాయర్లకు తగు అవకాశం ఇవ్వాలి’’ అని ఆయన వాదించారు. -
ప్రభుత్వ ఉద్యోగులను విదేశాలకు వెళ్లనీయని చైనా
ప్రభుత్వ ఉద్యోగులపై చైనా ప్రభుత్వం వింత వింత ఆంక్షలు పెడుతోంది. ఉపాధ్యాయులు, వైద్యులు సహా ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులెవరినీ దేశం దాటి విదేశాలకు వెళ్లనీయడం లేదు. ప్రజల్లో సైద్ధాంతిక భావాలు సడలకుండా ఉండేందుకు, విదేశీ ప్రభావాన్ని అరికట్టడానికి, జాతీయ భద్రతను పెంచడానికి చైనా ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుంది.కీలక ఆంక్షలు ఇవే..పాస్ పోర్ట్ సరెండర్: చాలా మంది ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఇప్పుడు తమ పాస్ పోర్ట్ లను స్థానిక అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది.వ్యక్తిగత ప్రయాణానికి అనుమతి తప్పనిసరి: విదేశాలలో వ్యక్తిగత సెలవులను కూడా యజమాన్యాలు లేదా స్థానిక ప్రభుత్వ విభాగాలు ఆమోదించాలి. అయితే విదేశీ పర్యటనలకు అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు.విదేశాల్లో చదువుపై నిషేధం: చాలా ప్రావిన్సుల్లో విదేశాల్లో చదువుకున్న వ్యక్తులు ఇప్పుడు కొన్ని ప్రభుత్వ పదవులకు అనర్హులు.వ్యాపార ప్రయాణ ఆంక్షలు: సాధారణ పరిశోధన, అధ్యయనం ప్రయాణాలను కూడా అనేక ప్రాంతాలలో నిషేధించారు.ఇదంతా ఎందుకంటే..తమ దేశ ప్రజలపై ముఖ్యంగా విద్యావేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులలో విదేశీ సైద్ధాంతిక ప్రభావం గురించి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కువగా ఆందోళన చెందుతోంది. రాజకీయ క్రమశిక్షణ, పార్టీ పట్ల విధేయతను బలోపేతం చేసే విస్తృత ప్రచారంలో భాగంగా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాలతో ఉద్యోగుల వ్యక్తిగత, కుటుంబ సంబంధాలను కూడా అధికారులు మ్యాపింగ్ చేస్తున్నారు.ఆంక్షల పరిధి, ప్రభావంచైనా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ఆంక్షలు చైనా శ్రామిక శక్తిలో విస్తృత భాగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వ పట్టణ స్థానిక సంస్థలలో పనిచేసే సుమారు 16.7 కోట్ల మందిపై వీటి ప్రభావం పడుతోంది. కొన్ని నగరాల్లో రిటైరైన వారు కూడా తమ పాస్‌పోర్టులను తిరిగి పొందడానికి రెండేళ్లు వేచి ఉండాల్సి వస్తుంది. కొంతమంది ఉద్యోగులనైతే సోషల్ మీడియా ఖాతాలను బహిర్గతం చేయాలని, తమ నివాస నగరాన్ని విడిచి వెళ్లేటప్పుడు రిపోర్ట్ చేయాలని అడుగుతున్నారట. -
మూడు రోజుల్లో పరిష్కారం
కర్నూలు, న్యూస్‌లైన్: ప్రజల ఫిర్యాదులపై మూడు రోజుల్లోగా ఎలాంటి చర్యలు తీసుకున్నామనే విషయాన్ని తమ సిబ్బంది తెలియజేస్తారని ఎస్పీ రఘురామిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ‘మీతో మీ ఎస్పీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు తన చాంబర్లో బాధితుల నుంచి ఫోన్లో స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. 9440795567 నెంబర్‌కు ఫోన్ చేసిన ప్రజలతో ‘హలో.. నమస్తేనండి. నేను ఎస్పీ రఘురామిరెడ్డిని మాట్లాడుతున్నా. చెప్పండి.. ఏంటి మీ సమస్య’ అంటూ శాంతి భద్రతలపై ఫిర్యాదులను ఎంతో ఓపికగా వింటూ పేపర్‌పై రాసుకున్నారు. మొదటి రోజు 32 ఫిర్యాదులు అందంగా.. వాటిని సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాలకు సంబందించిన ఫిర్యాదులను(ఎక్సైజ్, రెవెన్యూ) సంబంధిత అధికారులకు ఉత్తరాల ద్వారా తెలియజేస్తామని బాధితులకు ఎస్పీ హామీ ఇచ్చారు. బాకీ వసూళ్లు, ఒప్పంద ఉల్లంఘన వంటి సివిల్ తగాదాల్లో పోలీసులు కలగజేసుకోరని, ఈ ఫిర్యాదులను న్యాయ సేవా సంస్థ వారికి పంపుతామన్నారు. శాంతి భద్రతలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రమే ప్రస్తావించి పరిష్కారం పొందాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కల్లూరు మండలం ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేమడూరు గ్రామంలో బస్టాండ్ వద్దనున్న దేవాలయం సమీపంలో మద్యం బెల్టు దుశాఖలు.. 10 పబ్లిక్ సెక్టార్ల ఉద్యోగులు నేటి నుంచి సమ్మె బాట పడుతుండగా.. ఉపాధ్యాయులు ఈనెల 16 నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు. మొత్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు దాదాపు కాణం ఉండటంతో భక్తులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తుడు నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఆళ్లగడ్డలోని లక్ష్మీ ప్రసన్న సినిమా థియేటర్ వద్దనున్న స్థలాలను బలిజ వెంకటేశ్వర్లు, ప్రసాద్, వెంకటరెడ్డి అనే వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని ఘాతంశెట్టి నాగరత్నమ్మ ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా మరికొన్ని సమస్యలను ఎస్పీ స్వీకరించారు.


