India A vs Sri Lanka A
-
భారత జట్టులో మార్పు.. కేకేఆర్ స్టార్‌కు లక్కీ ఛాన్స్
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ అనుకుల్ రాయ్‌కు సువర్ణావకాశం వచ్చింది. భారత్-‘ఎ’ జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. హర్ష్ దూబే స్థానంలో శ్రీలంక, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్లతో జరిగే త్రైపాక్షిక సిరీస్‌కు అనుకుల్ రాయ్ ఎంపికయ్యాడు.హర్ష్ దూబే స్థానంలో..ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గురువారం వెల్లడించింది. కాగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే ఇటీవలే టీమిండియా నుంచి పిలుపు అందుకున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు, వన్డే సిరీస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు.కారణం ఇదేకాగా హర్ష్ దూబే జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. అయితే, అఫ్గన్‌తో సిరీస్ కంటే ముందు ప్రకటించిన భారత జట్టులో హర్ష్ దూబేకు చోటిచ్చారు సెలక్టర్లు. తాజాగా అతడి స్థానంలో అనుకుల్ రాయ్‌ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.జార్ఖండ్‌కు చెందిన 27 ఏళ్ల అనుకుల్ రాయ్ స్పిన్ ఆల్‌రౌండర్. ఎడమచేతి వాటం గల ఈ ఆటగాడు ఐపీఎల్-2026లో కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికి 13 మ్యాచ్‌లు ఆడి 43 పరుగులు చేయడంతో పాటు.. ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.తిలక్ వర్మ సారథ్యంలోఇదిలా ఉంటే.. శ్రీలంకలో జరిగే వన్డే ముక్కోణపు సిరీస్‌లో ఆతిథ్య జట్టుతో పాటు భారత్-‘ఎ’, అఫ్గన్-‘ఎ’ జట్లు పాల్గొంటాయి. జూన్ 9- జూన్ 21 మధ్య ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు డంబుల్లా వేదిక. ఇక ఈ సిరీస్‌లో భారత జట్టుకు హైదరాబాదీ తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తొలిసారిగా ‘ఎ’ జట్టులో చోటు దక్కించుకున్నాడు.ముక్కోణపు వన్డే సిరీస్‌కు భారత్-‘ఎ’ జట్టు (అప్డేటెడ్)తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుశ్ బదోని, నిశాంత్ సంధు, సూయాన్ష్ షెడ్గే, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్. -
Asia Cup 2026: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్- 2026 టోర్నీలో భారత్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. తొలి సెమీస్ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా ఈ టీ20 టోర్నీ ఫిబ్రవరి 13న మొదలైంది.ఎనిమిది జట్లుగ్రూప్-ఎ నుంచి భారత్-ఎ, పాకిస్తాన్-ఎ.. యూఏఈ, నేపాల్ మహిళా జట్లు పాల్గొనగా.. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ-ఎ, శ్రీలంక-ఎ, థాయ్‌లాండ్, మలేషియా మహిళా జట్లు బరిలో నిలిచాయి. ఈ నేపథ్యంలో గ్రూప్-ఎ టాపర్లు భారత్, పాక్.. గ్రూప్-బి టాపర్లు బంగ్లాదేశ్, శ్రీలంక సెమీ ఫైనల్ చేరాయి.118 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు శుక్రవారం తలపడ్డాయి. టెర్థాయ్ స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల ధాటికి తాళలేక 19.4 ఓవర్లలో కేవలం 118 పరుగులే చేసి లంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.రాధా యాదవ్‌కు నాలుగుఓపెనర్లు సంజనా కావింది (31), హన్సిమ కరుణరత్నె (14)లతో పాటు సత్య సందీపణి (15), షాశిని గిమ్హాని (22) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో కెప్టెన్ రాధా యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. తనుజా కణ్వార్, ప్రేమా రావత్ చెరో రెండు వికెట్లు కూల్చారు. సైమా ఠాకూర్, మిన్ను మణి తలా ఒక వికెట్ పడగొట్టారు.బ్యాటింగ్‌లోనూ ఇరగదీసిన కెప్టెన్ ఇక లక్ష్య ఛేదనలోనూ భారత మహిళా జట్టు అదరగొట్టింది. ఓపెనర్లలో నందిని కశ్యప్ (13) నిరాశపరిచినా.. వ్రిందా దినేశ్ మెరుపు ఇన్నింగ్స్ (20 బంతుల్లో 42)తో ఆకట్టుకుంది. వన్‌డౌన్ బ్యాటర్ల అనుష్క శర్మ (18 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించగా.. రాధా యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ (18 బంతుల్లో 31 నాటౌట్)తో మెరిసింది.𝐅𝐢𝐧𝐚𝐥𝐬, 𝐡𝐞𝐫𝐞 𝐰𝐞 𝐜𝐨𝐦𝐞 🇮🇳Radha Yadav seals it with a boundary as India book their place in the final 😍#SonySportsNetwork #GirlsRising | DP World Women’s Asia Cup Rising Stars 2026 pic.twitter.com/vuMvuCPhUH— Sony Sports Network (@SonySportsNetwk) February 20, 2026ఫైనల్లో భారత్మిగిలిన వాళ్లలో తేజల్ హసాబ్నిస్ (3), మిన్ను మణి (2) విఫలమయ్యారు. అయితే, వ్రిందా వేసిన పునాదిపై అనుష్క, రాధా ఇన్నింగ్స్ నిర్మించడంతో 13.3 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 119 పరుగుల టార్గెట్‌ను భారత్ పూర్తి చేసింది. తద్వారా శ్రీలంకను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.లంక బౌలర్లలో షాశిని రెండు వికెట్లు తీయగా.. యసాంతి నిమంతికకు ఒక వికెట్ దక్కింది. ఇక ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్ములేపిన రాధా యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్లో విజేతతో భారత్ ఆదివారం నాటి టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది. చదవండి: పాకిస్తాన్ క్రికెటర్లకు భారీ షాక్!


