అన్నదాతలు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం రైతన్నల శ్రేయస్సును కాంక్షించే ప్రభుత్వమని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ‘రైతు దినోత్సవం’ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు.