భార్య చేసిన ప‌నికి ఏడ్వ‌లేక న‌వ్వేశాడు

ప‌నీపాటా లేకుండా కూర్చుండే బ‌దులు ఏదైనా చేయొచ్చు క‌దా అనే వాక్యాన్ని మ‌నం ఎన్నోసార్లు విన్నాం. కానీ క‌రోనా వ‌ల్ల ఇప్పుడు ఉన్న ప‌నులు కూడా బంద్ పెట్టి మ‌రీ ఖాళీగా తింటూ కూర్చుంటున్నాం. దీంతో పెద్ద‌వాళ్లు ఈ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు పాత పుస్త‌కాల‌ను దుమ్ము దులిపి ఓ ప‌ని ప‌డుతుంటే యువ‌త‌రం కొత్త వంట‌కాలు, కొత్త గేమ్స్‌ అంటూ ఎలాగోలా కాలాన్ని నెట్టుకొస్తోంది. పెళ్లైన‌వారి విషయానికొస్తే భార్య‌లు కొత్త వంట‌కాలు చేసి భ‌ర్త‌ల‌కు ప‌రీక్ష‌లు పెడుతున్నారు. అయితే ఇక్క‌డ చెప్పుకునే జంట మాత్రం అనుష్క‌, విరాట్ కోహ్లీల జంట‌ను అనుస‌రించింది. వీరిలాగే కొత్త హెయిర్‌స్టైల్ ట్రై చేసింది, కానీ బెడిసికొట్టింది. పాపం, జుట్టును స‌తీమ‌ణి చేతిలో పెట్టి బ‌లైపోయాడా భ‌ర్త‌. న‌టి ఎమిలీ పెండ‌ర్‌గాస్ట్ త‌న భ‌ర్త కోరీకి కొత్త హెయిర్‌స్టైల్ ప్ర‌య‌త్నించింది.

ఎక్కడెక్క‌డ క‌త్తిరించాలో అత‌ను సూచ‌నలిస్తూ ఉండ‌గా ఆమె త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయింది. ఎక్కువ‌గా క‌త్తిరిస్తున్నావు.. అని అప్పుడ‌ప్పుడు హెచ్చ‌రిస్తూ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. చివ‌రాఖ‌రికి ఎటూ తేల‌ని, వ‌ర్ణించ‌డానికి వీలు లేని రీతిలో అత‌ని జుట్టు త‌యారైంది. దీంతో ఆమె ప‌డీప‌డీ నవ్వుతుండ‌గా, అత‌డు మాత్రం ఏడ్వ‌లేక న‌వ్విన‌ట్లు ఉంది. ఈ వీడియోను న‌టి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయ‌గా సుమారు మూడు మిలియ‌న్ల మంది వీక్షించారు. "ఇందుకే నా జుట్టును ఎవ‌రి చేతులోనైనా పెట్టాలంటేనే వెన్నులోనుంచి ద‌డ పుడుతుంది" "నా హెయిర్ క‌త్తిరించ‌డానికి నిన్ను ఎందుకు అనుమ‌తించ‌నో ఇప్పుడ‌ర్థ‌మ‌వుతోందా?" "కాస్త‌ ఈ హెయిర్ స్టైల్ పేరు చెప్తారా?" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ‌రోవైపు కేశ ప్రేమికులు  ఎంత ఘోరం జ‌రిగిపోయిందంటూ విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top