వైర‌ల్‌: ప్యాంటులో దూరిన పాము

లక్నో: పామును చూస్తేనే స‌గం చ‌స్తాం. అలాంటిది  ఏకంగా అది వేసుకున్న బ‌ట్ట‌ల్లో దూరితే... ఊహించ‌డానికే భ‌యంక‌రంగా ఉంది క‌దూ! కానీ నిజంగానే ఓ వ్య‌క్తి ప్యాంటులో పాము దూరిన షాకింగ్ ఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో జ‌రిగింది. మీర్జాపూర్‌ జిల్లాలోని అరోరా గ్రామంలో అంగ‌న్‌వాడీ కేంద్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ప‌నుల‌ను పూర్తి చేసేందుకు ఎనిమిది ‌మంది కార్మికులు ప‌ని చేస్తున్నారు. వీరంద‌రూ రాత్రిళ్లు అక్క‌డే ఆరుబ‌య‌ట నిద్రిస్తారు. ఇంత‌లో ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో ఏమో కానీ ఓ పెద్ద పాము మ‌రెక్క‌డా చోటు లేన‌ట్లు లావ్‌రేశ్‌ కుమార్ అనే కార్మికుడి ప్యాంటులో దూరింది. ఉద‌యం మూడు గంట‌ల‌కు ప్యాంటులో ఏదో క‌దులుతున్న‌ట్లు అత‌డికి అనిపించింది.

కొద్ది క్ష‌ణాల‌కు అది పామ‌ని అర్థ‌మ‌య్యేస‌రికి భ‌యంతో నోట మాట రాలేదు. ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని పక్క‌నే ఉన్న కార్మికుల‌కు చెప్ప‌డంతో వారు పాముల‌ను ప‌ట్టేవాళ్లను పిలుచుకు వ‌చ్చేందుకు ప‌రిగెత్తుకెళ్లారు. మ‌రోవైపు క‌దిలితే ఆ పాము ఎక్క‌డ కాటు వేస్తోంద‌న‌న్న భ‌యంతో మూడు గంట‌ల వ‌ర‌కు అత‌ను స్థంభాన్ని ప‌ట్టుకుని క‌ద‌ల‌కుండా నిల్చున్నాడు. అనంత‌రం పాములు ప‌ట్టే వ్య‌క్తి వ‌చ్చి అత‌డి ప్యాంటు విప్పి పామును బ‌య‌ట‌కు తీశారు. అది విష‌స‌ర్ప‌మ‌ని ఆయ‌న‌ వెల్ల‌డించారు. అదృష్టం బాగుండి ఎట్ట‌కేల‌కు ఆ వ్య‌క్తి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ప్రస్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top