ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేస్తుండగా.. అనూహ్యంగా!

వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్న జంట మధ్య ప్రేమ, ప్రణయాలను చాటుతూ.. చిత్రీకరిస్తున్న ప్రీవెడ్డింగ్‌ ఫొటో షూట్స్‌ ఇప్పుడు బాగా పాపులర్‌ అవుతున్నాయి. చాలామంది జంటలు పెళ్లికి ముందే తమ మధ్య మధురానుభూతులను ఇలా ఫొటోల్లో బంధిస్తున్నారు. అయితే, ఇటీవల కేరళలోని ఓ జంటపై చిత్రీకరించిన ప్రీవెడ్డింగ్‌ షూట్‌ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. అందుకు కారణం షూటింగ్‌ సందర్భంగా జరిగిన ఒక చిన్న అపశ్రుతి..

ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లో భాగంగా ఓ నదిలో పడవలో కూర్చుని జంట ముద్దుపెట్టుకోబోతుండగా.. పడవ బ్యాలెన్స్‌ తప్పి.. ఇద్దరు అమాంతంలో నీళ్లలో పడిపోయారు. అదృష్టం బావుండి పెద్దగా లోతు లేకపోవడంతో జంటకు పెద్దగా గాయాలు కాలేదు. కానీ వారు అమాంతం నీటిలో పడిపోయిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top