వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరే ఇతర పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన లేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ పార్టీ చేస్తున్న పోరాటం ఆగదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఆయన నిజాయితీపరుడని నిరూపించుకోవాలని అన్నారు.