ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను వంచించడానికి అనేక కుట్రలు చేస్తున్నారని, ఆయన కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని చెప్పిన చంద్రబాబు ప్రత్యేకహోదా విషయంలో అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తామనగానే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారనీ.. ప్రత్యేకహోదాపై వైఎస్‌ఆర్‌సీపీకి క్రెడిట్ వస్తుందన్న భయంతో బాబు డ్రామాలు ఆడటం మొదలుపెట్టారని విమర్శించారు.