ఎన్టీఆర్ హయాంలోనే పరిపాలన వికేంద్రీకరణ జరిగిందని.. సమితి వ్యవస్థల నుంచి మండల వ్యవస్థలు తీసుకొచ్చారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలిని టీడీపీ నేతలు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన బిల్లులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో రైతులను చంద్రబాబు నిలువునా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజల ఆమోదంతో ఎప్పుడు గెలవలేదన్నారు.