వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మరణశాసనం తప్పదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు జోస్యం చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను నమ్ముకున్న జేబు మీడియా సంస్థల ద్వారా చంద్రబాబు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌కు లేనిపోని నిందలు ఆపాదిస్తున్నారని, జగన్ స్థాయిని తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల్లో వైఎస్ జగన్‌కు ఆకాశమంత విశ్వసనీయత ఉందని, దాన్ని ఎవరు చెరపలేరన్నారు. హిందుజా భూ వ్యవహారంలో ఎలాంటి చర్చకైనా తమ పార్టీ సిద్ధమని సవాల్ విసిరారు. 20 రోజుల్లో చంద్రబాబుకు చెంప పగులకొట్టే తీర్పును ప్రజలు ఇవ్వబోతున్నారని జోస్యం చెప్పారు.