అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీఎమ్మెల్యే సివేరి సోమలను కాపాడలేని చంద్రబాబు సర్కార్ తమపై బురద జల్లుతోందని వైఎస్సార్‌సీసీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు విదేశాలకు వెళ్లి వచ్చి కొత్త ఉత్సాహంతో పచ్చి అబద్దాలు బెబుతున్నారని ఎద్దేవా చేశారు. దోపిడీ కోసం మైనింగ్ చట్టాలను మార్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.