వైఎస్ షర్మిల కువైట్ పర్యటనలో భాగంగా జోసెఫ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జీవము గల దేవుడు’ 8వ వార్షికోత్సవ కార్యక‍్రమానికి ఆదివారం తన భర్త బ్రదర్ అనిల్‌కుమార్‌తో కలిసి హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటీ సభ్యులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. జగనన్నను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని పార్టీ అభ్యర్థుల విజయంలో వారు భాగస్వామలు అయినందుకు తమ కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కువైట్‌లో ఉంటూ.. వారు చేసే సామాజిక సేవ అభినందనీయమని ఆమె కొనియాడారు.