షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలకు వినియోగదారుల ఫోరమ్ మొట్టికాయలు వేసింది. ఎమ్పార్టీ కంటే అధిక రేట్లతో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న మల్టీప్లెక్స్ థియేటర్లపై స్థానిక వినియోగదారుల న్యాయస్థానం కొరడా ఝళిపించింది. విజయవాడలోని ఐదు మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున (మొత్తం 25 లక్షల రూపాయలు) భారీ జరిమానా విధించింది.