లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాను ఉంచాలనుకుంటున్న ముంబైలోని జైలు గదిని పూర్తిగా వీడియో తీసి తమకు సమర్పించాలని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించిన తర్వాత ఆయనను ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంచేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సెప్టెంబర్ 12న వాదనలు ముగియనున్నాయి. మంగళవారం వెస్ట్‌మినిస్టర్ కోర్టులో మాల్యా కేసు విచారణకు వచ్చింది. భారత్‌లోని జైళ్ల్లలో మౌలిక సదుపాయాలు సరిగా ఉండవని, సహజసిద్ధమైన వెలుతురు, పరిశుభ్రమైన గాలి ఉండదని మాల్యా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ముంబై సెంట్రల్ జైలులోని 12వ గదికి సంబంధించిన ఫొటోలను భారత్ అధికారులు కోర్టుకు సమర్పించారు.