‘జస్ట్‌ ఫర్‌ ఫన్‌.. మీరూ ట్రై చెయ్యండి’

టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ హెల్తీ లైఫ్‌ స్టైల్‌ను ఫాలో అవుతుంటాడు. 37 ఏళ్ల వయసులో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌తో మిస్టర్‌ కూల్‌ ఆశ్చర్యపరుస్తుంటాడు. తరచూ అందుకు సంబంధించిన వీడియోలను తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటాడు కూడా. అయితే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధోనీ ఓ ఫన్నీ వీడియోను పోస్ట్‌ చేయగా.. అది కాస్త వైరల్‌ అవుతోంది. ‘జస్ట్‌ ఫర్‌ ఫన్‌.. ఇంట్లో మీరూ ట్రై చెయ్యండి’ అంటూ సైక్లింగ్‌ చేసే వీడియో ఒకదాన్ని పోస్ట్‌ చేశాడు. చెవిలో హెడ్‌ సెట్‌.. నోట్లో చెక్క ముక్క పెట్టుకుని పళ్లం వైపు సైకిల్‌తో ధోనీ దూసుకుపోయాడు. స్లో మోషన్‌లో మహేంద్రుడు చేసిన ఆ ఫన్నీ స్టంట్‌ను మీరూ చూడొచ్చు. అయితే ఈ వీడియోను చూసి అర్థం కాక జుట్టు పీక్కుంటూ కామెంట్లు చేసే ఫ్యాన్సే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ మధ్యే ఇంగ్లాండ్‌ టూర్‌లో పదివేల పరుగులు పూర్తి చేసుకున్న ఈ డ్యాషింగ్‌ బ్యాట్స్‌మన్‌.. ఇండియాలో మోస్ట్‌ అడ్మైర్డ్‌ స్పోర్ట్స్‌పర్సన్‌గా నిలిచాడు కూడా.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top