సభలో వంశీ మాట్లాడుతూ.. ‘ఇళ్ల పట్టాలు, పోలవరం కుడి కాలువ రైతులు గురించి సీఎం జగన్‌ను కలిశాను. నా నియోజకవర్గ సమస్యలు సీఎంకు చెప్పుకున్నాను. మానవతా దృక్పథంతో సీఎం సానుకూలంగా స్పందించారు. తరువాత నాపై చంద్రబాబు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. సీఎం ఇంగ్లీష్ మీడియం పెట్టాన్ని స్వాగతించాను.పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఎంతో ఉపయోగ పడుతుంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు వలన పేదలు ఎంతో లాభపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ వలన ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి. ఇంగ్లీష్ మీడియం వలన సమాజం బాగుపడుతుంది. అమ్మఒడి వలన పేద పిల్లల మేలు జరుగుతుంది. పప్పు బ్యాచ్ నాపై విమర్శలు చేస్తున్నారు. జయంతికి వర్ధంతి తేడా తెలియని వాళ్లు విమర్శలు చేస్తున్నారు. గుడెద్దు ముసిలి ఎద్దు నాపై విమర్శలు చేస్తున్నారు. నలబై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందనే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు. వరదలు వలన ఇసుక తీయడం ఇబ్బంది అని చెప్పాను. నేను టీడీపీ సభ్యుడునే నాకు మాట్లాడే హక్కు లేదా. నేను టీడీపీతో ఉండలేను.’ అని అన్నారు.
నేను టీడీపీతో ఉండలేను: వంశీ
Dec 10 2019 9:45 AM | Updated on Mar 21 2024 11:38 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement