దళితుల విషయంలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రదర్శిస్తున్న కపట ప్రేమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. ఇక, ఆర్టీసీ విలీనం కోసం చారిత్రాత్మక బిల్లు ప్రవేశపెడుతన్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. మరోవైపు నాలుగు నెలల్లో అయోధ్యలో రామమందిరం కడతామని కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. ఇదిలా ఉండగా, పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు, నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఇకపోతే, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది.