అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేతలు | TDP Leaders Are Purchasing Postal Ballots | Sakshi
Sakshi News home page

అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేతలు

Apr 5 2019 7:02 AM | Updated on Mar 20 2024 5:05 PM

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ జోరుగా ప్రలోభాలకు తెరదీశారు. గుడివాడలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు కొనుగోలు చేస్తూ తెలుగు తమ్ముళ్లు అడ్డంగా దొరికిపోయారు. గుడివాడ మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్స్‌ను ఎన్నికల విధుల కోసం ఇతర ప్రాంతాలకు నియమించటంతో వారికి ఎలక్షన్‌ కమిషన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించింది. ఇదే అదనుగా భావించిన టీడీపీ నాయకులు ఒక్కొక్క పోస్టల్‌ బ్యాలెట్‌కు రూ.2500 ఇస్తూ కెమెరాకు చిక్కారు. 200 మందికి పైగా మున్సిపల్‌ ఉద్యోగుల వద్ద నుంచి పోస్టల్‌ బ్యాలెట్లను తెలుగు తమ్ముళ్లు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement