రేడియో జాకీని లైంగికంగా వేధించిన కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న పార్వతి మాట్లాడుతూ.. గజల్ శ్రీనివాస్ తనకు తండ్రి లాంటి వాడని తెలిపింది. ఆయన దగ్గర తాను చాలాకాలంగా పని చేస్తున్నానని, మహిళలను వేధించే వ్యక్తి కాదని చెప్పింది. ఆరోపణలు చేసిన ఆమె... తనకు తానుగా మసాజ్ చేస్తానని ముందుకొచ్చిందని పార్వతి ఆరోపిస్తోంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇంత స్థాయికి ఎదిగిన వ్యక్తి...ఓ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడంటే నమ్మేలా లేదని శ్రీనివాస్ ఫ్యామిలి ఫ్రెండ్ జ్యోతిర్మయి అన్నారు.