పోలవరం కాంట్రాక్టర్‌పై వరాల జల్లు | State Cabinet has agreed to increase the Special Improvement Amount to Rs 150 crore | Sakshi
Sakshi News home page

పోలవరం కాంట్రాక్టర్‌పై వరాల జల్లు

Nov 2 2017 6:53 AM | Updated on Mar 21 2024 8:47 PM

పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌(జలాశయం) కాంట్రాక్టర్‌పై రాష్ట్ర మంత్రి మండలి మరోసారి వరాల వర్షం కురిపించింది. కాంట్రాక్టర్‌ రోజువారీ ఖర్చుల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఇంప్రెస్ట్‌ ఎమౌంట్‌ను రూ.25 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెంచేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కాంట్రాక్టర్‌ ఇప్పటికే చేసిన అదనపు పనుల బిల్లులపై క్లెయిమ్‌ల పరిష్కారానికి హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో వివాద పరిష్కార మండలి (డీఏబీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అయితే కాంట్రాక్టు ఒప్పందంలో డీఏబీ ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement