దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎట్టకేలకు ఏలూరు త్రీటౌన్ పో లీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అతని అనుచ రు లు నేతల రవి, చుక్కా వెంకటేశ్వరరావుతోపాటు ముగ్గురు గన్‌మెన్‌లపైనా కేసు నమోదు చేశారు. ఏలూరు రైల్వేస్టేషన్ సమీపంలోని ఐఎంఎల్ డిపో హమాలీ మేస్త్రి రాచీటి జాన్‌ను ఎమ్మెల్యే ప్రభాకర్ తన ఇంటికి పిలిపించుకుని కొట్టి, కులంపేరుతో దూషించిన ఘటనపై కార్మిక, దళిత సంఘాలు, వామపక్ష ఇతర రాజకీయ పార్టీలు పది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయటంతో చేసేదిలేక పోలీస్ అధికారులు కేసు నమోదు చేశారు. చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, ఐపీసీ 323 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.