నగరంలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన సంధ్యారాణి మృతి చెందింది. ఆమె మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి డాక్టర్లు కుటుంబసభ్యులకు తెలిపారు. వివరాలివి.. సంధ్యారాణి రోజూ విధులు ముగించుకున్న తర్వాత లాలాపేట్ విద్యామందిర్ మీదుగా ఇంటికి నడిచి వెళ్తుంటుంది. గురువారం సాయంత్రం కార్తీక్ కిరోసిన్ డబ్బాతో ఆ ప్రాంతానికి చేరుకుని కాపు కాశాడు.