మైనారిటీలకు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మేలు ఎవరూ మరవలేరని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఇక్కడ పార్టీ కార్యలయంలో జరిగిన మైనారిటీ విభాగం రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.