నీరవ్‌ మోదీ స్ఫూఫ్‌ యాడ్‌ చూశారా? | Priyanka Chopra Nirav Modi Spoof Ad | Sakshi
Sakshi News home page

Feb 24 2018 1:08 PM | Updated on Mar 22 2024 10:48 AM

సాక్షి, ముంబై : ప్రముఖ వ్యాపారవేత్త, డైమండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీ.. పీఎన్‌బీ స్కామ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చాక మీడియా మొత్తం(సోషల్‌ మీడియాతోసహా) ఆ వ్యవహారానికి సంబంధించిన చర్చలతోనే నడుస్తున్నాయి. ఈ క్రమంలో నటి ప్రియాంక చోప్రా ఆ కంపెనీతో ఒప్పందం చేసుకోవటం, యాడ్‌ లో నటించడం, స్కామ్‌ బయటపడటంతో కాంట్రాక్టు రద్దు చేసుకోవటం తెలిసిందే. 

అయితే నీరవ్‌ మోదీ డైమండ్‌ యాడ్‌లో ప్రియాంక నటించిన ప్రకటనకు స్ఫూప్‌ చేసిన కొందరు దానిని వైరల్‌ చేసేశారు. ప్రియాంక కోసం సిధార్థ్‌ మల్హోత్రా ఎదురు చూస్తుంటాడు. ఇంతలో ఆమె కోపంగా వస్తుంది. ‘నేను మళ్లీ ఎస్‌ చెప్పను. నా కోలీగ్‌ నన్ను పెద్ద లోన్‌ కోసం సాయం అడిగింది. నేను యస్‌ చెప్పాను. కానీ, అతను(నీరవ​మోదీని ఉద్దేశించి) మాత్రం చెప్పా పెట్టకుండ మాయమైపోయాడు’ అంటూ  ఎడిట్‌ చేశారు. 

నిజానికి యాడ్‌లో నో ఉద్దేశ్యంతో ఉన్న ప్రియాంకను నీరవ్‌ మోదీ డైమండ్‌ రింగ్‌ చూపించి సిధార్థ్‌ ఆకర్షిస్తాడు. నీరవ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇది సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement