పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తిచేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసం పోలవరం హెడ్ వర్క్స్ (జలాశయం) చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌బాబుకు కుడి, ఎడమ కాలువల పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లో సభ్యునిగా కూడా సుధాకర్‌బాబును నియమించారు.