ఓ వ్యక్తికి తాను కొత్త కెమెరా తీసుకున్నాన్న ఉత్సాహం కాసేపు కూడా నిలవలేదు. అత్యంత దగ్గర నుంచి షూట్ చేద్దామని టైమ్ సెట్ చేసి ఉంచగా దానిని దొంగ ఎత్తుకెళ్లారు. అయితే ఆ దొంగ మనిషి కాదండోయ్ ఓ కాకి. అవును నార్వేకు చెందిన జెల్ రాబర్ట్‌సన్ అనే వ్యక్తి సముద్రపు కాకిని అతి సమీపంలో నుంచి తన కెమెరాలో బందించాలని అనుకున్నాడు. అందులో భాగంగా ఇంటి బయట కంటెగోడపై కెమెరాను పెట్టి దానికి సమీపంలో బ్రెడ్‌ముక్కలు వేశాడు. తొలుత అక్కడి వచ్చిన కాకులు బ్రెడ్ ముక్కలు తిన్నాయి.