ప్రజాస్వామ్య విలువలు పెంచే విధంగా శాసనసభలో చర్చాలకు రావాలని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సూచించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ శాసన సభ్యులు పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు వాదనలో పస ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. శాసన సభలో చర్చకు దూరంగా ఉండటం, శాసన సభ ఆమోదం తెలిపిన బిల్లులు అడ్డుకోవడం, జాప్యం చేయడంపై ధైర్యంగా చర్చకు రావాలని ప్రతిపక్షాన్ని డిమాండ్ చేశారు.