పెద్దమనిషి ముసుగులో చెలామణి అవుతున్న గజల్ శ్రీనివాస్ పచ్చి మోసగాడు అని లైంగిక వేధింపులు ఎదుర్కొన్న యువతి ఆరోపించింది. లైంగిక వేధింపుల విషయాన్ని గజల్ శ్రీనివాస్ భార్య దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్లు ఆమె తెలిపింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ..‘ వేధింపులపై గజల్ శ్రీనివాస్ కుటుంబసభ్యులు స్పందించలేదు. గత రెండు నెలలుగా వేధింపులు ఎక్కువ అయ్యాయి. వాటిని తట్టుకోలేకే సాక్ష్యాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశా. ఆయన వద్ద పనిచేసే చేసే పార్వతి మంచిది కాదు. ఆమె నన్ను ప్రలోభపెట్టేందుకు చాలా ప్రయత్నించింది. సార్ మాట వింటే మంచి లైఫ్ ఉంటుందని చెప్పుకొచ్చేది.