కుటుంబంలో నలుగురిని మింగిన డెంగ్యూ | Four Members Of A Family Died with Dengue Fever | Sakshi
Sakshi News home page

కుటుంబంలో నలుగురిని మింగిన డెంగ్యూ

Oct 31 2019 8:13 AM | Updated on Mar 21 2024 11:38 AM

మంచిర్యాల జిల్లా కేంద్రం శ్రీశ్రీనగర్‌లో నివాసం ఉంటోన్న ఓ ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయుడు గుడిమల్ల రాజగట్టు (30), సోని (28) దంపతులు. రాజగట్టుకు జ్వరం రావటంతో ఈనెల 12న స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి, మూడ్రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఎంతకూ జ్వరం తగ్గకపోగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 16న మృతిచెందాడు. మృతుడికి సంబంధించిన ఐదోరోజు కర్మ కార్యక్రమాలను నిర్వహిస్తుండగానే రాజగట్టు తాత లింగయ్య(80)కు జ్వరం వచ్చింది. దీంతో లింగయ్యను అదేరోజు రామకృష్ణాపూర్‌ సింగరేణి ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఈ నెల 20న మరణించాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement