ఐటీ గ్రిడ్స్ సంస్థ కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదుతోనే ఐటీ గ్రిడ్స్‌లో సోదాలు నిర్వహించామని తెలిపారు. ఉద్యోగులు సమక్షంలోనే సోదాలు జరిపామన్నారు. సంస్థకు చెందిన ఉద్యోగులు విక్రమ్ గౌడ్, చంద్ర శేఖర్, ఫణి కుమార్, భాస్కర్‌ల సమక్షంలోనే ఆదారాలు సేకరించామని తెలిపారు. కీలకమైన ఎలక్ట్రానిక్ డివైజ్‌లను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని చెప్పారు.