పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు మరోసారి దాష్టీకానికి దిగారు. పోలవరం కాలువపై జరుగుతున్న మట్టి రవాణాపై ఫిర్యాదు చేశాడనే అక్కసుతో.. వైఎస్సార్‌సీపీ నేత మేడికొండ కృష్ణపై హత్యాయత్నం చేశారు. కృష్ణను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటికి తీసుకెళ్తూ...కారులోనే తీవ్రంగా కొట్టారు.