‘సేవ్‌ కంట్రీ, సేవ్‌ డెమోక్రసీ’ | Centre vs Mamata: Supreme Court to take up CBI plea today | Sakshi
Sakshi News home page

‘సేవ్‌ కంట్రీ, సేవ్‌ డెమోక్రసీ’ లక్ష్యంగా చేస్తున్న నిరసన

Feb 5 2019 8:20 AM | Updated on Mar 22 2024 11:10 AM

కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ ఆదివారం చేపట్టిన ధర్నా కొనసాగుతోంది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా సోమవారం రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఇన్నాళ్లూ అటు ఎన్డీయే, ఇటు యూపీఏలకు సమ దూరంలో ఉన్న బీజేడీతోపాటు అనేక విపక్ష పార్టీలు ఈ అంశంలో మమతకు మద్దతు పలికాయి. పార్లమెంటు ఉభయ సభలు కూడా ఇదే అంశంపై దద్దరిల్లాయి. అటు శారదా, రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్‌ కుంభకోణాలకు సంబంధించిన ఆధారాల ధ్వంసం అంశంపై కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను విచారించే విషయమై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Advertisement
 
Advertisement
Advertisement