ఈడీ కస్టడీకి చిదంబరం
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులోని నగదు అక్రమ చలామణికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరంను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న చిదంబరంను విచారించేందుకు, అవసరమైతే అరెస్ట్ చేసేందుకు ఈడీకి స్థానిక కోర్టు మంగళవారం అనుమతి మంజూరు చేసింది. చిదంబరంను బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి విచారించేందుకు జైల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని జైలు అధికారులను ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ ఆదేశించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి