ఓ మహిళా బీజేపీ నేత పట్ల తృణమూల్ కాంగ్రెస్ నేతలు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. కనీసం మహిళా అనే గౌరవం లేకుండా రెండు సార్లు దాడి చేశారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఒక ఘటన పోలీసుల సమక్షంలోనే జరగగా.. మరో ఘటన మీడియా సాక్షిగా చోటుచేసుకుంది. అయినా నిందితులపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాకపోడం గమనార్హం.