సుదీర్ఘ పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉద్యోగాల నియామకం, ఆశా వర్కర్ల జీతాల పెంపు, ట్యాక్సీ, ఆటోలు నడుపుకొనే బడుగు జీవులకు ఆర్థిక సహాయం వంటి ఎన్నెన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ప్రభుత్వం.. తాజాగా హోంగార్డులకు శుభవార్త చెప్పింది. హోంగార్డుల జీతాన్ని రూ. 18 వేల నుంచి 21,300 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.