రాష్ట్రవ్యాప్తంగా పట్ణణ ప్రాంతాల్లో 4,000 వార్డు సచివాలయాల ఏర్పాటుకు మున్సిపల్‌శాఖ కసరత్తు చేస్తోంది. మరో వారం నుంచి పది రోజుల్లోనే వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకవైపు 81 వేల మంది వార్డు వలంటీర్ల నియామకానికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు వార్డు సచివాలయాల ఏర్పాటుకు మార్గదర్శకాలను రూపొందించారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటవుతాయి.