ఆరోగ్యశ్రీ చరిత్రలో కొత్త అధ్యాయం | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ చరిత్రలో కొత్త అధ్యాయం

Published Sat, Jan 4 2020 8:07 AM

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ అనేది దేశ ఆరోగ్య చరిత్రలోనే ఒక విప్లవం అని, ఈ దిశగా దేశంలోని 28 రాష్ట్రాలకన్నా మిన్నగా మరో అడుగు ముందుకు వేస్తూ.. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఈ పథకాన్ని వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం ఆయన ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య రంగానికి సంబంధించి పలు వరాలు ప్రకటించారు. ఏలూరు ఆశ్రం, శ్రీకాకుళం కిమ్స్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి వారికి భరోసా అందించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికామని చెప్పారు. ఈ సభలో సీఎం ఇంకా ఏం మాట్లాడారంటే.. 

Advertisement
Advertisement