‘చట్టం అందరికి ఒక్కటే’ పేరిట బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విద్యార్థులు చిత్రమైన ఉద్యమాన్ని చేపట్టారు. ఆదివారం నాడు జరిగిన ఓ బస్సు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించడంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు దీనికి శ్రీకారం చుట్టారు. పోలీసులు సవ్యంగా విధులు నిర్వహించక పోవడం వల్ల, అనుభవం లేని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు బస్సులు నడుపుతుండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని భావించి వారు రోడ్డెక్కారు.