నీటిలో ఈదితేనే బడి..!

 చిరునవ్వులు చిందిస్తూ బడికి వెళ్లాల్సిన బాల్యం.. బిక్కుబిక్కుమంటూ అడుగులేస్తోంది. చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రోడ్డుని దాటుతూ ప్రమాదపుటంచులలో పయనం సాగిస్తోంది. దరంగ్‌ జిల్లాలో గల దాల్‌గావ్‌లో కల్వర్టు నిర్మాణం నిర్లక్ష్యానికి గురవడంతో.. కొద్దిపాటి వర్షానికే రెండు గ్రామాల మధ్యనున్న లింకు రోడ్డు నీట మునిగిపోయింది. దీంతో తల్లిదండ్రుల సాయంతో  అయిదడుగుల లోతు నీటి కాలువను దాటుకుని ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. తాటి బొదల సాయంతో 5 అడుగుల నీటిలో ప్రయాణం చేస్తున్న చిన్నారుల ‘సాహస యాత్ర’అక్కడి అధికార యంత్రాగాన్ని వేలెత్తి చూపుతోంది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top