ఓటర్ల నమోదుకు దరఖాస్తుల వెల్లువ | 18 lakh voters enrolled | Sakshi
Sakshi News home page

ఓటర్ల నమోదుకు దరఖాస్తుల వెల్లువ

Sep 21 2018 7:06 AM | Updated on Mar 22 2024 11:28 AM

రాష్ట్ర శాసనసభ రద్దయిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. ఓటరు నమోదు కోసం ఇప్పటివరకు సుమారు 17 లక్షల నుంచి 18 లక్షల మంది ఫారం–6 దరఖాస్తులు సమర్పించారని వెల్లడించారు. కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం సంతృప్తికరంగా సాగుతోందని, పెద్ద ఎత్తున యువత దరఖాస్తు చేసుకుంటోందన్నారు. ఎన్నికల ప్రకటన విడుదలై అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించడానికి 10 రోజుల ముందు వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement