సోనమ్‌​ మెహంది వేడుకలో జాహ్నవి, ఖుషి కపూర్‌ | Is Jahnavi Going To Become Next Bride In Kapoor Family | Sakshi
Sakshi News home page

సోనమ్‌​ మెహంది వేడుకలో జాహ్నవి, ఖుషి కపూర్‌

May 8 2018 10:11 AM | Updated on Mar 22 2024 11:07 AM

అనిల్‌ కపూర్‌ గారాల పట్టి సోనమ్‌ కపూర్‌ వివాహం నేడు ఆనంద్‌ అహుజాతో జరుగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం మెహంది వేడుకను ఎంత ఘనంగా నిర్వహించారో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తే అర్థం అవుతుంది. ఈ వేడుకల్లో శ్రీదేవి కూతుళ్లు జాహ్నవి, ఖుషి కపూర్‌ కూడా పాల్గొన్నారు. అయితే సోనమ్‌​ మెహంది వేడుకలకు సంబంధించిన వీడియోల్లో ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది. మెహంది వేడుక సందర్భంగా సోనమ్‌ కపూర్‌ పెళ్లి కూతురు ధరించే ఎర్రని గాజులను ధరించింది. వీటిని ‘ఛుధా’ అంటారు. అలానే గాజులతో పాటు ధరించే ‘కలేరి’ని కూడా ధరించింది.

సిక్కుల విశ్వాసం ప్రకారం పెళ్లి కుమార్తె చేతికి ఉన్న ‘కలేరి’ ఏ అవివాహిత అమ్మాయి తలను తాకుతుందో ఆ అమ్మాయి వివాహమే వారి కుటుంబంలో జరగబోయే తదుపరి వివాహమని నమ్మకం. దీన్ని దృష్టిలో పెట్టుకుని సోనమ్‌ తాను ధరించిన కలేరిని జాహ్నవి తలకు తాకించాలని ప్రయత్నించింది. అంటే కపూర్ల ఇంట తర్వాత పెళ్లి పీటలెక్కబోయేది జాహ్నవి అనే కదా.. కానీ కలేరి జాహ్నవి తలను తాకలేదు. కలేరిని  జాహ్నవి తలకు తాకించడానికి ప్రయత్నిస్తూ సోనమ్‌ కపూర్‌ ‘సారీ జాను’ అన్నది ఆ వెంటనే జాహ్నవి కుర్చిలో నుంచి లేచి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement