పంజాబ్ నేషనల్ బ్యాంకుని భారీ కుంభకోణంలో ముంచెత్తి, విదేశాలకు పారిపోయిన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీని హాంకాంగ్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముంది. భారత అభ్యర్థన మేరకు, అక్కడి స్థానిక చట్టాలు, పరస్పర న్యాయ సహాయం ఒప్పందాలపై హాంకాంగ్ పోలీసులు నీరవ్ మోదీని అదుపులోకి తీసుకోనున్నారని చైనా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి జెంగ్ షుయాంగ్ తెలిపారు. ఇటీవలే నీరవ్ మోదీ హాంకాంగ్‌లో ఉన్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. పీఎన్‌బీ కుంభకోణ కేసులో భాగంగా నీరవ్ మోదీని ప్రొవిజనల్ అరెస్ట్(తాత్కాలిక నిర్భందం) చేయాలని హాంకాంగ్ అథారిటీలను కోరినట్టు ప్రభుత్వం పేర్కొంది.