సొంతగడ్డపై విజయయాత్రను కొనసాగిస్తూ బంగ్లాదేశ్‌ను కూడా చిత్తు చేసిన టీమిండియా మరింత కాన్ఫిడెంట్ గా ఉంది. జట్టుగా తాము ప్రస్తుతం అత్యుత్తంగా రాణించడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. పుణేలో బుధవారం మీడియాతో కోహ్లీ మాట్లాడుతూ.. 'మా జట్టు ఏంతో పటిష్టంగా ఉంది. ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు గురించి మేము ఆందోళన చెందడం లేదు. జట్టుతో పాటు ఆటగాడిగానూ, కెప్టెన్ గానూ మెరుగవుతున్నాను. ఆసీస్ జట్టులో కొందరు మాత్రమే ఫామ్ లో ఉన్నారు. నాకు 22 ఏళ్లున్ననప్పుడు 35 ఏళ్ల వ్యక్తులతో పోల్చి చూశారు. క్రమక్రమంగా నేను ఆ దశకు చేరుకుంటున్నానను. క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను' అని వివరించాడు.