దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో బుధవారం అపశ్రుతి చోటు చేసుకుంది. ఫీల్డింగ్ చేస్తూ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా గాయ పడ్డాడు. ఇండియా బ్లూ బ్యాట్స్‌మన్ పంక సింగ్ కొట్టిన బంతిని ఆపేందుకు లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఓజా ముందుకు వచ్చాడు. అరుుతే ఒక్కసారిగా అనూహ్యంగా బౌన్‌స అరుున బంతి అతని వైపు దూసుకొచ్చింది. దాంతో తప్పించుకునే ప్రయత్నంలో ఓజా వెనక్కి తిరగ్గా... బంతి అతని తల వెనుక భాగంలో బలంగా తగిలింది.