రైతు సమస్యలపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ మంగళవారం దద్ధరిల్లింది. ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలతో మార్మోగింది. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ప్రత్యేకంగా సమావేశమైన ఏపీ శాసనసభలో...వైఎస్‌ఆర్ సీపీ సభ్యులు రైతుల సమస్యలపై చర్చకు పట్టుబట్టారు. సభ ప్రారంభం కాగానే రైతు సమస్యలపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యుల వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.