గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు కొరటంతో మృతి చెందిన మృతి చెందిన శిశువు కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన విజయవాడ వెళ్లనున్నారు. మరోవైపు విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రులు కామినేని శ్రీనివాస్, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, ఎంపీ గల్లా జయదేవ్ ఇవాళ ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వస్పత్రి దుస్థితిని వివరించేందుకు వచ్చిన వైఎస్ఆర్ సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, వంగవీటి రాధా, మేరుగ నాగార్జునను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.