నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం వాకాడులోని పార్టీ నేత నేదురుమల్లి పద్మనాభరెడ్డి నివాసానికి వెళ్లారు. పద్మనాభరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అక్కడి నుంచి స్థానిక అశోక స్తంభం వద్ద స్థానికులతో వైఎస్ జగన్ కొద్దిసేపు మాట్లాడారు.